చైతూ నిజంగా "ఇంటిలిజెంటే"..?
on Feb 10, 2018
డెస్టెనీ.. లక్.. అదృష్టం.. పేరు ఏదైనా కానీ.. ఇలాంటిది ఒకటుందని నమ్మక తప్పదు. సినీరంగానికి ఇది ఎక్కువ వర్తిస్తుంది. కొన్నిసార్లు ఎవరో చేయాల్సిన ఫ్లాప్ సినిమా ఇంకెవరి చేతికో వెళ్తుంది.. అలాగే కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన సూపర్‌హిట్ సినిమా ఇంకొకరి చేతికి వెళ్లిపోతుంది. మెగా హీరో సాయిథరమ్ తేజ్, వివి వినాయక్‌ల కాంభినేషన్లో వచ్చిన మూవీ ఇంటిలిజెంట్. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోగా.. మార్నింగ్ షోకి మొత్తం మ్యాటర్ తెలిసిపోయింది. రోటీన్ స్క్రీన్‌ప్లేతో వినాయక్ మార్క్ రెగ్యులర్ స్టంట్స్‌తో వచ్చిన ఇంటిలిజెంట్ ఆడియన్స్‌ని చికాకు పెట్టింది.
ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకుని తేజూ పెద్ద తప్పు చేశాడని మెగాభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమాలో ఉన్నప్పుడు ఎంచుకోవాల్సిన కథ ఇదేనా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతి పక్కనబెడితే ఇంటిలిజెంట్ కథను రచయిత ఆకుల శివ.. మొదట నాగచైతన్యకు చెప్పినట్లు ప్రజంట్ ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. తన మార్కెట్‌కు.. తన అభిమానులకు కానీ ఇలాంటి స్టోరీలు నచ్చవని చైతూ నో చెప్పాడట. ఆ వెంటనే ఇది మెగా కాంపౌండ్‌కే చేరడం.. వినాయక్ దర్శకత్వంలో తేజూ ఓకే చెప్పాడం జరిగిందట. ఈ సినిమా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం.. విడుదలవ్వడం.. డిజాస్టర్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయింది. స్టోరీ సెలక్షన్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చైతూ బతికిపోగా.. తేజూ బుక్కయిపోయాడు.