యుద్ధం శరణం ఫస్టాఫ్ రివ్యూ
on Sep 8, 2017
ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో నటనపరంగానూ మంచి మార్కులు వేసుకున్న అక్కినేని నాగచైతన్య తాజాగా యుద్ధం శరణం సినిమాతో ఈ ఏడాది మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఇవాళ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రివ్యూ షోలు పడటంతో సినిమా టాక్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. నాగచైతన్య లుక్, క్యారెక్టర్ చాలా కొత్తగా ఉన్నాయట. లవ్ షేడ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయట. నాగచైతన్య నటనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులు చూస్తారట.