దుమ్ములేచినంత మాత్రాన చైతూకి కలిసి వస్తుందా..?
on May 27, 2017
సినిమా వాళ్లకు సెంటిమెంట్లకు అవినాభావ సంబంధం ఉంటుంది. హీరోకు మూడక్షరాల టైటిల్ కలిసొచ్చిందనో..ఆ హీరోయిన్ ఉంటే హిట్ కన్ఫర్మ్ అనో ఇలా బోలేడు సెంటిమెంట్లు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే..కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటించిన రారండయ్ వేడుక చూద్దాం సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమా హిట్ కావడంతో ఆ సినిమా వాసనలు కళ్యాణ్‌ను వెంటాడాయి. సొగ్గాడే చిన్నినాయన క్లైమాక్స్‌లో చిన్న నాగార్జునను, లావణ్య త్రిపాఠిని బంధించి తీసుకెళ్తుండగా..అప్పుడు బంగార్రాజు క్యారెక్టర్ స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వస్తాడు. సేమ్ అదే ఫ్రేమ్‌ని మక్కీకి మక్కీ దించేశాడు కళ్యాణ్. రారండోయ్ క్లైమాక్స్‌లో చైతూ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంటే దుమ్ము లేస్తుంది. అప్పుడు నాగార్జునకు కలిసివచ్చింది కదా అని ఇప్పుడు కలిసిరావాలని లేదు కదా..? అయినా సినిమాను నడిపించేది బలమైన కథ కాని సెంటిమెంట్లు కాదు. ఆ విషయం కళ్యాణ్‌కృష్ణ గుర్తిస్తే మంచిది.