వాటిపైనే అక్కినేని ఫ్యామిలీ మోజు!
on Jan 16, 2021
కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన తనయులు నాగచైతన్య - అఖిల్ ఈ ఏడాది ప్రథమార్ధంలో నాలుగు సినిమాలతో సందడి చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీరి నుంచి రాబోతున్న ఆ చిత్రాలన్నీ ఇంగ్లిష్ టైటిల్స్ తోనే తెరకెక్కుతుండడం.
నాగ్ విషయానికి వస్తే.. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆఫీసర్ గా ఆయన నటించిన చిత్రం వైల్డ్ డాగ్. పేరు వింటేనే తెలుస్తోంది.. ఇదొక ఆంగ్ల శీర్షికతో రూపొందుతున్న సినిమా అని. ఈ సంవత్సరం ఆరంభంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదల కానుంది.
ఇక చైతూ సంగతే తీసుకుంటే.. ప్రస్తుతం తను చేతిలో ఉన్న రెండు సినిమాలు కూడా ఇంగ్లిష్ టైటిల్స్ తోనే తెరకెక్కుతున్నాయి. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో థాంక్యూ చేస్తున్నాడు ఈ అక్కినేని యంగ్ హీరో.
అలాగే అఖిల్ విషయానికి వస్తే.. వేసవిలో విడుదలకు సిద్ధమైన అతని తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కూడా ఇంగ్లిష్ టైటిల్ నే.
మొత్తమ్మీద.. నాగ్, ఆయన తనయులు చైతూ, అఖిల్.. ఈ ఏడాది ఫస్టాఫ్ లో ఇంగ్లిష్ టైటిల్స్ తో తెరకెక్కుతున్న సినిమాలతోనే పలకరిస్తున్నారన్నమాట. ఏదేమైనా.. అక్కినేని వారి ఇంగ్లిష్ టైటిల్స్ మోజు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్.
Also Read