English | Telugu

అఖిల్ కెరీర్ తో ఆడుకుంటున్న నాగార్జున

on Mar 28, 2018

 

అక్కినేని అఖిల్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడుతున్నాడు నాగార్జున. మొదటి సినిమా అఖిల్ చేయడం అతి పెద్ద తప్పిదమయితే, ఇప్పుడు అంతకు మించి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. 24 లాంటి ప్లాప్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో హలో నిర్మించిన చేతులు కాల్చుకున్నాడు నాగార్జున. తొలి ప్రేమ తో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ అట్లూరి తో అఖిల్ మూడవ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా తర్వాత అఖిల్, రామ్ గోపాల్ వర్మతో జత కడతాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్ని నిజం చేస్తూ, వర్మ ట్విట్టర్ లో ధృవీకరించాడు. "నా మొదటి సినిమా శివకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు నాగార్జున హీరోగా నేను ఆఫీస్ అనే సినిమా నిర్మిస్తున్నాను. కొత్తగా, నేను అఖిల్ తో తీయబోయే సినిమాని నాగార్జున నిర్మించనున్నాడు," అని వివరించాడు. అంతటితో వదలకుండా, అఖిల్ ని పొగడ్తలో ముంచెత్తాడు. శివ చేసేప్పుడు నాగార్జున కన్నా కూడా, అఖిల్ ఇప్పుడు అన్ని విషయాల్లో చాలా బెటర్ అని బటర్ రాసాడు. ప్రేమ ప్రధానంగా సాగే ఈ సినిమా లో యాక్షన్ పాళ్ళు ఎక్కువుంటాయని, చాలా రియలిస్టిక్ గా తీస్తానని వివరించాడు వర్మ. అయితే, అక్కినేని అభిమానులు మాత్రం, ఇంత పెద్ద రిస్క్ అవసరమా నాగార్జున అని ప్రశ్నిస్తున్నారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్మ హిట్టు బొమ్మ తీసిన పాపాన పోలేదు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here