'మనవడి' గా తనయుడు
on Apr 12, 2019
నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా 'సోగ్గాడే చిన్నయినా' నిలించింది. ఇందులో రెండు పాత్రల్లో నటించి అలరించిన నాగార్జున అభిమానులకు చక్కటి వినోదాన్ని పంచి పెట్టారు. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగం `బంగార్రాజు` వస్తోంది. నాగార్జున కు తోడుగా మరో పాత్ర కూడా ఈ కథలో ఉంది. `బంగార్రాజు` కి అతని మనవడికీ జరిగే కథ ఇది. ఆ పాత్ర లో అఖిల్ కనిపించనున్నారని సమాచారం. ఇంతకు ముందు ఈ పాత్ర కోసం నాగచైతన్య పేరు పరిశీలించారు. అయితే చైతూ కంటే, అఖిల్ కి ఈ పాత్ర బాగుంటుందని అఖిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. `మన్మథుడు 2` షూటింగ్ లో ఉన్నారు నాగార్జున. ఆ సినిమా పూర్తయ్యాకే `బంగార్రాజు` పట్టాలెక్కుతుంది.