అఖిల్ కోసం అంతా రెడీ!!
on May 8, 2019
అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం అంటున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కానుందని సమాచారం అందుతోంది. ఇక స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రానికి ఫ్యామిలీ ఎమోషన్స్ , కమర్షియల్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన కియారా అద్వానీ కానీ, రష్మికా మండన్న కానీ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయట. త్వరలో ఈ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. నాగార్జున కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read