షూటింగ్లో 4 గోల్డ్ మెడల్స్ కొట్టిన స్టార్ హీరో అజిత్
on Mar 8, 2021
చెన్నైలో జరిగిన తమిళనాడు స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ హీరో అజిత్ 6 మెడల్స్ గెలుచుకున్నాడు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నైలో ఇటీవల జరిగిన 46వ తమిళనాడు స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో చెన్నై రైఫిల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ హీరో అజిత్ ఏకంగా 6 మెడ్సల్ సాధించాడు. వాటిలో నాలుగు స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. కొంతకాలంగా రైఫిల్ షూటింగ్‌ను హాబీగా మలచుకున్న అజిత్, చెన్నై రైఫిల్ క్లబ్లో ప్రాక్టీస్ చేస్తూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కాడు. నిజానికి ఆయన రాష్ట్ర, జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడు.
ప్రస్తుతం తమిళనాడు స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అజిత్ మెడల్స్ అందుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పిస్టల్ 10 మీటర్స్ (ఐఎస్ఎస్ఎఫ్) టీమ్ , సెంటర్ ఫైర్ పిస్టల్ .32 (ఎన్ఆర్) 25 మీటర్స్ టీమ్, స్టాండర్డ్ పిస్టల్ .22 (ఐఎస్ఎస్ఎఫ్) 25 మీటర్స్ టీమ్, ఫ్రీ పిస్టల్ .22 (ఎన్ఆర్) 50 మీటర్స్ టీమ్ విభాగాల్లో అజిత్ అగ్రస్థానం పొందాడు. అలాగే సెంటర్ ఫైర్ పిస్టల్ .32 (ఐఎస్ఎస్ఎఫ్) 25 మీటర్స్ టీమ్, స్టాండర్డ్ పిస్టల్ .22 (ఎన్ఆర్) 25 మీటర్స్ టీమ్ ఈవెంట్లలో ద్వితీయ స్థానం పొందాడు.
అజిత్ సాధించిన విజయాలకు సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ అభినందల సందేశాలతో సోషల్ మీడియాను ముంచెత్తారు. #Ajith #CongratsThalaAjith లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.