ఐశ్వర్యరాయ్‌కి పితృవియోగం
on Mar 18, 2017
బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి కృష్ణరాజ్ రాయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇవాళ కృష్ణరాజ్ ఆరోగ్యం విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. దీంతో అమితాబ్ బచ్చన్ నివాసంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు కృష్ణరాజ్ రాయ్ మృతికి సంతాపం తెలిపారు.