English | Telugu

త్రివిక్రమ్‌పై పవన్ అభిమాని ఆవేదన

on Jan 11, 2018

పవర్ స్టార్  అభిమానుల ఆకాంక్షలన్నింటినీ ‘అజ్ఙాతవాసి’తో  పాతాళంలో పాతేశాడు త్రివిక్రమ్. అభిమానుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసిందీ సినిమా. ఎన్నడూలేంది బాహాటంగానే సినిమాను విమర్శిస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా త్రివిక్రమ్ పై గరంగరంగా ఉన్నారు. 

రీసెంట్ గా తెలంగాణకు చెందిన ఓ అభిమాని త్రివిక్రమ్ పై విరుచుకుపడ్డాడు. ‘చావాల్నా? బతకాల్నా? ఇంత వరస్ట్ గా తీయడమేంటి?’ అంటూ మండిపడ్డాడు. ఆ అభిమాని ఆవేదన అక్షర రూపంలో మీకోసం. 

‘అవి పాటలా? ఏమన్నా.. అర్థమయ్యాయా? దేవిశ్రీని ఎందుకు తప్పించినట్టు? తమిళం నుంచి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎందకు తెప్పించినట్టు? జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది.. ఇలా పవర్ స్టార్ కి ఎన్ని మ్యూజికల్ హిట్లు ఇచ్చినాడు  దేవిశ్రీ. మణిశర్మకు ఇచ్చినా మంచి పాటలిచ్చేటోడు. కనీసం సాయికార్తీక్ అయినా బావుండేది. ఈ తమిళం ఆయన ఎక్కడ దొరికాడు? అర్థంకాని పాటలతో సినిమాను అద్శాన్నం చేసి పారేశాడు. ’

‘సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టినవ్.  ఏమి లాభమొచ్చే? అసలు సినిమా దేని గురించి తీసినవ్? ఎందుకు తీసినవ్? అసలు ఈ సినిమా ద్వారా ఏం చెప్పినవ్? ఓ ఇంట్రో లేదు. ఒక్క పాట రుచిపచీ లేదు.   తలెత్తుకోలేకపోతున్నాం. ఏడ్వడం ఒక్కటే తక్కువ.’

’ఒంటిగంట దాకా మేలుకొని సినిమా థియేటర్లోకెళ్లి నిద్రపోయినమంటే... ఎత వరస్ట్ గా తీసినవో అర్థం చేసుకో. సైన్మా మొదలైన 20 నిమిషాలకే తెలిసిపాయ... ఇందులో దమ్ములేదని. మనసు కూడా చూడ్డానికి సహకరించలా. నిద్రపో నిద్రపో అని చెబుతాంది. నువ్వు ఇంత చండాలంగా తీస్తావని కలలో కూడా అనుకోలా!‘

‘అను ఇమ్మానియేల్... ఆ అమ్మాయిని ‘మజ్ను’  సైన్మాలో ఎంతబాగా చూపించిండ్రు! ఈ సైన్మాలో ఏంది ఆ మేకప్పు?  ఏంది ఆ బీడీలు సిగెట్లు దాగుడు? లేడీస్ ని చూపించే పద్దతేనా అది?’ 

‘పాటలు ఎందుకొస్తాయో అర్థం కాదు. ఎందుకు పోయాయో అర్థం కాదు. అసలవి పాటలా? ఎంత అన్యాయం చేస్తివయ్యా త్రివిక్రమ్. థియేటర్ వైపుకు పోడానికే భయమేస్తాంది. ’

‘రాత్రంబవళ్లూ పవన్ కోసం ఫ్లెక్సీలు కట్టి... సినిమాకోసం ఆశగా ఎదురు చూసే అభిమానులం. పవన్ కోసం ప్రాణాలిటోళ్లం. అలాంటి మాకే సైన్మా నచ్చలేదంటే.. ఇక బయటొళ్లకి ఎందుకు నచ్చుతాది? ఎలక్షన్స్‌లో దిగే టైంలో గబ్బు లేపి పెట్టినావ్. అసలు నిన్ను గాదు అనాల్సింది... ఈ సైన్మా ఒప్పుకున్న పవర్ స్టార్ ని అనాలి’

అభిమానుల మనోగతం అదన్నమాట!


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here