English | Telugu

టాక్ ఎలా ఉన్నా.. పవన్ ఇక్కడ..!! దుమ్మురేపిన కలెక్షన్స్

on Jan 11, 2018

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ సందడే వేరు. అభిమానుల కన్నా ట్రేడ్ వర్గాలే ఆయన మూవీ కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటాయి. ఎందుకంటే ఒక లుక్‌తో వసూళ్లని శాసించగల స్టామినా పవన్ సొంతం. మరి ముఖ్యంగా పవన్‌ని ఓపెనింగ్స్‌ కింగ్‌గా చెబుతుంటారు అభిమానులు. ఇప్పుడైతే బాహుబలి వచ్చి చేరింది కానీ నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ పవర్‌స్టార్ పేరిటే ఉండేవి.

రీసెంట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ద్వారా తిరిగి ఈ రికార్డును పవర్‌స్టార్ దక్కించుకుంటారని పవన్ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆశించాయి. త్రివిక్రమ్ దర్శకత్వం... భారీగా విడుదలవ్వడంతో పవన్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాడని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అజ్ఞాతవాసి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఓవర్సీస్‌లో 570 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇప్పటికే 481 లొకేషన్స్‌లో 1.3 మిలియన్ డాలర్లను దాటినట్లు ఫిలింనగర్ టాక్. దీంతో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి అజ్ఞాతవాసి రెండవ స్థానంలో నిలిచింది. 4.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి 2 మొదటి స్థానంలో కొనసాగుతోంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here