18 ఏళ్లకు ఇద్దరు పిల్లల తల్లిగా...
on Apr 2, 2020
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' చిత్రాన్ని, హిందీలో అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి, హిందీ రీమేక్‌కి డైరెక్షన్ చేస్తున్నాడు. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రను, హిందీలో మృణాల్ ఠాకూర్ పోషిస్తోంది. ఇంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30', జాన్ అబ్రహం 'బాట్లా హౌస్'లోమృణాల్ నటించింది.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వయసు 27 ఏళ్లు. 'జెర్సీ'లో హీరోయిన్ స్కూల్ బాయ్ తల్లిగా కనిపించే సీన్స్ చాలా ఉన్నాయి. యంగ్ ఏజ్‌లో పిల్లాడికి తల్లిగా నటించడం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ "20 ఏళ్ల వయసులో తల్లి అయిన అమ్మాయిలు చాలామందిని చూశా. అంతెందుకు? 18 ఏళ్లకు ఇద్దరు పిల్లల తల్లిగా నేనే నటించా... ఒక కమర్షియల్ యాడ్‌లో. అది జస్ట్ యాక్టింగ్ అంతే" అని అన్నారు. విచిత్రం ఏంటంటే... 'జెర్సీ' స్పోర్ట్స్ ఫిల్మ్. మృణాల్ నటిస్తున్న మరో హిందీ సినిమా 'తూఫాన్' కూడా స్పోర్ట్స్ ఫిల్మే. కాకపోతే అది బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందులో ఫర్హాన్ అఖ్తర్ హీరో. అతడు బాక్సర్ రోల్ చేస్తున్నాడు.
Also Read