కథ రాస్తున్న 'ఖైదీ నంబర్ 150' విలన్!
on Mar 24, 2020
మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150'లో విలన్ తరుణ్ రాజ్ అరోరా గుర్తున్నాడా? ఆ తర్వాత 'జయ జానకి నాయక', లాస్ట్ ఇయర్ రిలీజైన నిఖిల్ హిట్ సినిమా 'అర్జున్ సురవరం'లోనూ విలన్ రోల్స్ చేశాడు. అతడు ఒకప్పటి హీరోయిన్ అంజలా జవేరి భర్త. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ముఖ్యంగా ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇతడు, త్వరలో రచయితగా వస్తానని అంటున్నాడు. యస్... తరుణ్ అరోరా రైటర్‌గా రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ అతడు ఒక కథ రాస్తున్నాడు.
హిందీలో తరుణ్ అరోరాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 'జబ్ వియ్ మెట్'. షాహిద్ కపూర్, కరీనా కపూర్ ప్రేమలో ఉన్నప్పుడు దర్శకుడు ఇంతియాజ్ అలీ తీసిన ఈ సినిమా పెద్ద హిట్. అందులో కరీనాకు బాయ్ ఫ్రెండ్‌గా అన్షుమన్ పాత్రలో నటించాడు. ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఈ సినిమాకు తరుణ్ అరోరా సీక్వెల్ రాస్తున్నాడు. 'జబ్ ఐ లెఫ్ట్' అని. అన్షుమన్ కోణంలో కథ సాగుతుందట. ఆల్రెడీ కథ రాయడం స్టార్ట్ చేశాడు. ప్రొడక్షన్ కూడా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఒకే సినిమాతో రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా తరుణ్ అరోరా ఇంట్రడ్యూస్ కావచ్చు.