ENGLISH | TELUGU  

జెనీలియాకు రామ్ స్వీట్ బ‌ర్త్‌డే విషెస్‌

on Aug 5, 2020

 

న‌టి జెనీలియా దేశ్‌ముఖ్‌ నేడు (ఆగ‌స్ట్ 5) పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా ద్వారా ఆమెపై శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపించారు. అనేక‌మంది ఆమె స్నేహితులు "హ్యాపీ క్వారంటైన్ బ‌ర్త్‌డే" అంటూ ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ తెలిపారు. టాలీవుడ్ హీరో రామ్ సైతం వారిలో ఉన్నాడు. జెనీలియాకు ప్ర‌త్యేక‌మైన ఈరోజు ఒక పాత పిక్చ‌ర్‌ను షేర్ చేస్తూ బ‌ర్త్‌డే విషెస్ తెలిపాడు రామ్‌. జెనీలియా, ఆమె భ‌ర్త రితేష్ దేశ్‌ముఖ్‌, వాళ్ల ఇద్ద‌రి పిల్ల‌ల‌తో రామ్ స‌ర‌దాగా ఉన్న‌ప్ప‌టి ఫొటో అది.

త‌న క్లోజ్ ఫ్రెండ్‌కు అత‌ను ఓ స్వీట్ బ‌ర్త్‌డే నోట్ కూడా పెట్టాడు. "Happppyyy Birthday to the most selfless & caring friend anyone can ever ask for! Have the bestest year ahead Genuuu @geneliad ..we should all get together for the Sign of the hornsday again sometime.." అని రాసుకొచ్చాడు రామ్‌.

రామ్‌, జెనీలియా జంట‌గా సూప‌ర్ హిట్ మూవీ 'రెడీ'లో న‌టించారు. శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన ఆ మూవీ 2008లో విడుద‌లైంది. అప్ప‌ట్నుంచీ వాళ్ల మ‌ధ్య స్నేహం రోజు రోజుకూ పెరుగుతూ వ‌స్తోంది. జెనీలియా వివాహం త‌ర్వాత ఆమె కుటుంబం మొత్తానికీ స‌న్నిహిత‌మైపోయాడు రామ్‌. అత‌ను షేర్ చేసిన పిక్చ‌ర్ అందుకు నిద‌ర్శ‌నం.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.