వయసులో బాగా చిన్న హీరోయిన్లతో రొమాన్స్ బాగుండదు!
on Sep 29, 2020
'సవ్యసాచి' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడం ద్వారా తొలిసారి నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాధవన్... 'నిశ్శబ్దం'తో మరోసారి పలకరించబోతున్నాడు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అతడు సెలబ్రిటీ మ్యుజీషియన్‌గా నటించాడు. గతంలో మాధవన్ అంటే 'సఖి' తరహా రొమాంటిక్ సినిమాలు గుర్తొచ్చేవి. ఇప్పుడు అతడు హారర్, థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువ నటిస్తున్నాడు. అలాగని, రొమాన్స్‌కి దూరం కావడం లేదంటున్నాడు.
"రొమాన్స్ వయసుకు తగ్గట్టు ఉండాలి. 2030లో కూడా హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాను. అయితే, ఆ కథలు నా వయసుకు తగ్గట్టు ఉండాలి. చాలా సినిమాల్లో తమ కంటే వయసులో చాలా చిన్నవాళ్లు అయిన హీరోయిన్లను హీరోలు రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరినీ చూస్తే మంచిగా అనిపించదు" అని మాధవన్ అన్నాడు.
మొదట 'నిశ్శబ్దం'ను డైలాగులు లేకుండా మూకీ సినిమాగా తీయాలని అనుకున్నారట. హారర్ థ్రిల్లర్ కనుక ప్రేక్షకులకు అర్థం అవుతుందో? లేదో? అని అనుష్క పాత్రకు కాకుండా మిగతా పాత్రలకు కొన్ని డైలాగులు యాడ్ చేశామని మాధవన్ తెలిపాడు. ఈ సినిమాలో చెవిటి, మూగ అమ్మాయి పాత్రలో అనుష్క నటించారు. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో సినిమా విడుదల అవుతోంది.
Also Read