బిగ్ బాస్ నుంచి కుమార్ సాయి ఔట్.. రొమాంటిక్ యాంగిల్ కోసం మోనాల్ సేఫ్!
on Oct 19, 2020
బిగ్ బాస్ సీజన్ 4లో మరోసారి నెటిజన్ల జోస్యం నిజమైంది. బిగ్ హౌస్ లో ప్రతి ఎపిసోడ్ లోనూ ఏడ్చే మోనాల్ ను ఇంటికి పంపించాలని ప్రేక్షకులంతా కోరారు. అయితే హౌస్ లో లవ్ ట్రాక్ సెట్ చేసి ఎమోషన్, అట్రాక్షన్, రొమాంటిక్ సీన్స్ మిస్ అవుతాయన్న ఆలోచనతో ఆమెను కాదని, కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు అన్న విమర్శ వినిపిస్తోంది. మొదటివారంలో మేల్ కంటెస్టెంట్ డైరెక్టర్ సూర్యకిరణ్ ను ఇంటి నుంచి పంపించిన తర్వాత వరుసగా నాలుగువారాలు ఫిమెల్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.
గంగవ్వ స్వచ్ఛందంగా హౌస్ నుంచి వచ్చేయడంతో మేల్ కంటెస్టెంట్ల సంఖ్య పెరిగింది. దాంతో హౌస్ లో ఈక్వేషన్లు సెట్ చేసేలా ఈ సారి కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి మొదటివారం ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి ఆరోవారం వరకు అతి కష్టం మీద నెగ్గుకురాగలిగాడు. అయితే హౌస్ లోకి వెళ్లేముందు మూడు కోరికలతో వెళ్తున్నాను అన్న కుమార్ సాయి మొదటి రెండు కోరికలు తీరలేదు. మూడో కోరిక తీరుస్తానని నాగార్జున మాటిచ్చాడు.
కుమార్ సాయి బిగ్ హౌస్ లోకి వెళ్లేముందు మూడు కోరికలతో వెళ్తున్నానని చెప్పాడు. బిగ్ బాస్ టైటిల్ గెలవాలి, బయటకు వచ్చేలోగా కొవిడ్-19కు వ్యాక్సిన్ రావాలి. ఈ రెండు నిజం కాలేదు. ఇక మూడో కోరిక తాను రాసిన కథ వినడానికి నాగార్జున టైమ్ ఇవ్వాలి. ఈ మూడో కోరికను నాగార్జున అంగీకరించడంతో ఆనందంగా డ్యాన్స్ చేశాడు కుమార్ సాయి.
Also Read