కృష్ణుడి నిర్మాణంలో...‘బాయ్‌ఫ్రెండ్స్ గాళ్‌ఫ్రెండ్’
on Aug 5, 2020
నిర్మాతలుగా మారుతున్న నటీనటుల జాబితా రోజు రోజుకీ పెరుగుతోంది. తండ్రి చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌తో నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు ఎప్పట్నుంచో నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇటీవల ‘నిను వీడని నీడను నేనే’తో హీరో సందీప్ కిషన్ చలనచిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చాడు. తాజాగా ఈ జాబితాలో నటుడు కృష్ణుడు కూడా చేరాడు.
‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణుడు గుర్తున్నాడు కదా! పలు సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేశాడు. అతడు నిర్మాతగా మారారు. కూతురు నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అని ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ఓ సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఆ సినిమా టైటిల్ ‘మై బాయ్ ఫ్రెండ్స్ గాళ్ ఫ్రెండ్’. సెన్సార్ కంప్లీట్ అయ్యింది. త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మోడరన్ కల్చర్, యూత్ బేస్ చేసుకుని ఈ సినిమా చేశారట.
Also Read