ఈ 'ఖైదీ' కూడా ఆ 'ఖైదీ'లా సూపర్ హిట్టవుతుంది: కార్తీ
on Oct 21, 2019
"ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం నా క్యారెక్టరైజేషన్. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బయటకు వచ్చే ఒక 'ఖైదీ' క్యారెక్టర్. అతనికి ఒక కూతురు ఉంటుంది. కానీ అప్పటి దాకా ఆమెను అతను చూడలేదు. తను ఎలా ఉంటుందో కూడా తెలీదు. అన్ని అవాంతరాలని దాటుకొని తన కూతురిని చూడగలిగాడా? లేదా? అనేది కథ" అని చెప్పారు కార్తీ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'లో ఆయన టైటిల్ రోల్ పోషించారు. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ విడుదల చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా 'ఖైదీ' విడుదలవుతున్నసందర్భంగా కార్తీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
"డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీకి వచ్చారు. ఫస్ట్ మూవీ 'మానగారం'తోనే చాలా పెద్ద హిట్ అందుకున్నారు. ఈ కథ చెప్పేటప్పుడే 'ఇదొక కొత్త ఐడియా. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకసారి వినండి' అని చెప్పారు. సినిమా మొత్తం మాస్ ఉంటుంది. యాక్షన్ కూడా ఎక్కువే. ఒక రాత్రి నాలుగు గంటల కాలంలో కథ జరుగుతుంది. ఆ నాలుగు గంటల్లోనే చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని ఒక భారీ బడ్జెట్ సినిమాగా తీస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిపించింది. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది."
క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది
"ఇదొక బిగ్ యాక్షన్ ఫిలిం. పది సంవత్సరాలు తన కూతురిని చూడలేదు అంటే నాకు కూడా పెర్ఫామెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ నచ్చే ఈ సినిమా చేశాను. నిజ జీవితంలో నాకు ఒక కూతురు ఉండడం వల్ల తండ్రిగా నటించడం ఈజీ అయింది. నేను గతంలో 'విక్రమార్కుడు' మూవీని తమిళంలో రీమేక్ చేసేటప్పుడు నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని నటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య ఏమీ లేదు కాబట్టి అంతా హ్యాపీగా చేశాను."
డైలాగ్స్ బలం
"ఈ సినిమా బలాల్లో డైలాగ్స్ కూడా ఒకటి. ట్రైలర్లో నా డైలాగ్స్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో చూపించింది చాలా తక్కువ. రేపు సినిమాలో డైలాగ్స్‌కి మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతి సీన్ ఫ్రెష్‌గా ఉంటుంది. సినిమా ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిలింలా ఉంటుంది, కానీ నా క్యారెక్టర్ మాత్రం మాస్. ఇదొక యూనిక్ కాంబినేషన్. అతను ఎవరు? అతని గతం ఏంటి అనేది మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతను చెప్పే డైలాగ్స్‌కి ఆడియెన్స్ బాగా స్పందిస్తారు."
ఆ 'ఖైదీ' లాగే!
"చిరంజీవి గారి ఐకనిక్ ఫిల్మ్ 'ఖైదీ'.. అక్టోబర్ 28న విడుదలైన విషయం నాకు ముందు తెలీదు. ఇప్పుడే తెలిసింది. చాలా ఆనందమేసింది. ఇది చాలా మంచి విషయం. నా సినిమాకి అనుకోకుండా ఈ నెలే కుదిరింది. ఆ సినిమా లాగే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో నాతో పాటు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫేమస్ ఆర్టిస్టులు నటించారు."
హాలీవుడ్ స్టైల్ మ్యూజిక్
"ఇలాంటి ఒక మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నపుడు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోను ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టడమనేది న్యూ థాట్. అందుకు తగ్గట్లు ఒక హాలీవుడ్ మూవీలాగే మ్యూజిక్ ఇచ్చారు శ్యాం. మాములుగా ఇలాంటి సినిమా రెండు గంటలే ఉంటుంది. కానీ కాన్ఫిడెంట్‌గా 2 గంటల 20 నిమిషాలు పెడుతున్నామంటే తప్పకుండా దానికి సరిపోయేంత థ్రిల్ ఉన్న కంటెంట్ ఉండబట్టే."
ఇలాంటివి తరచూ రావు
"తెలుగులోనూ కొత్త కొత్త కథలతో థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. 'అర్జున్ రెడ్డి', అడవి శేష్ స్టైలిష్ థ్రిలర్ 'ఎవరు' వంటివి పెద్ద సక్సెస్ అయ్యాయి. అందులోను డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికీ చాలా దగ్గరయింది. ఇలాంటి సందర్భంలో 'ఖైదీ' లాంటి సినిమా చేసే అవకాశం తరచూ రాదు. ఎప్పుడో ఒక్కసారే వస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేటప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయాలి అనుకున్నాను. సాంగ్స్, రొమాన్స్ లేకుండా కేవలం యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే డిఫరెంట్ మూవీ ఇది. నేను కథలో ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటాను. అంతేకాని అలా ప్లాన్ చేసి సెలెక్ట్ చేస్తే వెరైటీ చేయడం చాలా కష్టం."
ఖైదీలు వెలుగును కోరుకుంటారు
"ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు మేము నిజ జీవిత ఖైదీలను కలిశాం. డైరెక్టర్ వారిని కలిసినప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు. చాలా కాలం జైలులో ఉన్న ఖైదీలు బయటకు వచ్చి వైట్ కలర్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది.. అని చెప్పారు. వెలుతురును వాళ్లంత ఇష్టపడతారు. ఒక విషయం చెప్పమంటారా.. ఈ సినిమాని మొత్తం 60 రాత్రులు షూట్ చేశాం. ఈ సినిమా తీసిన తర్వాత లోకేష్ కనకరాజ్‌కు విజయ్ గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇప్పటివరకూ నేను చేసిన అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్."
నెక్స్ట్ ప్రాజెక్ట్
"డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారితో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తున్నాను. దానిలో మా వదిన జ్యోతిక కూడా నటిస్తున్నారు. చాలా మంచి కథ. అందర్నీ ఆకట్టుకొనే అంశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథ."
Also Read