నా కొడుకు విడాకులు తీసుకుంటున్నాడు...విషెస్ తెలపండి..
on Apr 22, 2017
విషయం ఏదైనా కానీ.. అది మంచైన, చెడైనా ఈమధ్య అందరూ ట్విట్టర్ ద్వారా పదిమందికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు అలాంటి న్యూసే బయటపెట్టి అందరికీ షాకిచ్చాడు టాలీవుడు నటుడు బ్రహ్మాజీ. ఇంతకీ అందరికీ షాకిచ్చేలా బ్రహ్మాజీ బయటపెట్టిన న్యూస్ ఏంటనుకుంటున్నారా..?తన కొడుకు విడాకుల గురించి. ఆశ్చర్యంగా ఉంది కదా. చూడటానికి యంగ్ గా కనిపించే బ్రహ్మాజీకి అంత పెద్ద కొడుకు ఉన్నాడంటే కాస్త షాకింగ్ న్యూసే మరి. కొడుకు ఉండటమే షాకింగ్ న్యూస్ అనుకుంటే.. మళ్లీ అతనికి పెళ్లవడం.. దానికి తోడు విడాకుల వరకూ రావడం మరో షాకింగ్ న్యూస్. ఇంతకీ సంగతేంటంటే..
బ్రహ్మాజీ కొడుకు పేరు సంజయ్. అతనికి 2013 లో బెంగాళీ అమ్మాయి, కోల్‌కతాలో ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇంద్రాక్షి తో జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ గత కొద్దికాలంగా విడివిడిగానే ఉంటున్నారట. ఈ నేపథ్యంలో ‘నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారని., వాళ్లిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారని చెప్తూ ట్వీట్టర్ లో ట్వీ ట్ చేశాడు. అంతేకాదు వాళ్ల భవిష్యత్తు ఆనందంగా ఉండాలని అందరూ విషెస్ తెలపండంటూ ట్విట్ చేశాడు. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.