అభిషేక్ బచ్చన్ అలా చేశాడేంటి..?
on May 21, 2016
బాలీవుడ్ లో ఇప్పుడున్న జంటల్లో చూడముచ్చటైందిగా ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ల గురించి చెప్పుకుంటారు. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండటమే కాదు, ఎక్కడ చూసినా జంటగా తిరుగుతుంటారు. అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఒక పని, వీళ్లిద్దరి మధ్య ఉన్న విభేదాన్ని చూపించింది. అందరి ముందూ ఇది జరగడంతో, అక్కడున్న వాళ్లందరూ అవాక్కయ్యారు.
విషయంలోకి వెళ్తే, బాలీవుడ్ లో లేటెస్ట్ రిలీజ్ సరబ్ జిత్ సినిమాలో ఐశ్వర్య కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రీమియర్ కు మొత్తం కుటుంబంతో బచ్చన్లు హాజరయ్యారు. సినిమా అయిన తర్వాత బయటికొస్తున్న అభిషేక్, ఐష్ లను అక్కడున్న మీడియా ఫోటోలకు ఫోజులిమ్మని అడిగింది. అయితే ఫోటోలు తీసే సమయంలో కేమేరా వాళ్లందరూ ఐష్ ను ఫోజులడుగుతుండటంతో అభిషేక్ కు ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఒక్కసారిగా ఆమె చేయి వదిలేసి, ఆమెనే ఫోటోలు తీస్కోండి అంటూ వెళ్లిపోయాడు. ఓ పక్క ఐశ్వర్య పిలుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో ఐశ్వర్య చాలా కామ్ గా మీడియాకు నవ్వుతూ నమస్కారం పెట్టి వెళ్లిపోయింది.
ఎంత ఐష్ ను ఫోకస్ చేస్తే మాత్రం తన భార్యే కదా..అంత సీరియస్ అయిపోవాలా..? ఇద్దరికీ మధ్య ఏదో గొడవ అయినట్టుంది..! భార్య సక్సెస్ ను తట్టుకోలేకపోతున్నాడు అభిషేక్.. ఇవీ ఇప్పుడు బాలీవుడ్ మాట్లాడుకుంటున్న మాటలు. మరింతకీ అభిషేక్ ఎందుకలా చేశాడంటారు..?
Also Read