ఫిట్‌నెస్ కోచ్‌తో పీకల్లోతు ప్రేమలో ఆమిర్ ఖాన్ కూతురు! రుజువులివిగో...
on Nov 25, 2020
ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన డేటింగ్ లైఫ్‌ను బహిరంగంగా ఉంచడానికి ఎప్పుడూ మొహమాట పడలేదు. 2019 చివరలో మిషాల్ కృపలానీతో విడిపోయిన తరువాత, ఐరా తన ఫిట్నెస్ కోచ్ నూపుర్ శిఖారేతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఐరాకే కాకుండా, ఆమిర్ ఖాన్‌కు కూడా నూపుర్ శిక్షణ ఇస్తుండటం గమనార్హం. వాస్తవానికి, నుపూర్ సోషల్ మీడియా హ్యాండిల్‌ను పరిశీలిస్తే, ఐరా అతని వద్ద ఎలా శిక్షణ పొందుతోందో, అలాగే ఆ ఇద్దరూ ఎంత సన్నిహితంగా మెలగుతున్నారో కూడా గమనించవచ్చు.
ఒక రిపోర్ట్ ప్రకారం, లాక్డౌన్ సమయంలో ఇద్దరూ సన్నిహితమయ్యారు. ఫిట్‌నెస్ విషయంలో ట్రైనింగ్ తీసుకోవడానికి నూపుర్ దగ్గరకు ఐరా వచ్చింది. అప్పట్నుంచీ ఇద్దరూ ఒకర్నొకరు విడదీయరానంత దగ్గరయ్యారు. మహాబలేశ్వర్‌లోని ఆమిర్ ఫామ్‌హౌస్‌లో వారు హాలిడేస్ గడిపారంట కూడా. వారు దాదాపు అన్ని పండుగలను తమ క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి జరుపుకున్నారు. నూపుర్‌ను తన తల్లి రీనా దత్తాకు ఐరా పరిచయం చేసింది. ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. నిజానికి, ఐరా వాట్సాప్ డిస్‌ప్లూ పిక్చర్‌లోనూ ఆ ఇద్దరూ సన్నిహితంగా ఉండటం గమనార్హం.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
