ఫ్యామిలీతో కాకుండా సపరేట్‌గా ఉంటున్న హీరో!
on Jul 16, 2020
యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న 'బ్లాక్' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా యూనిట్ తీసుకున్న జాగ్రత్తలతో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే... యూనిట్ అందరికీ కరోనా టెస్టులు చేయించడం. టెస్టులలో నెగెటివ్ రిజల్ట్ వచ్చిన తరవాతే షూటింగ్ స్టార్ట్ చేశారు.
ప్రజెంట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 'బ్లాక్' షూటింగ్ చేస్తున్నారు. స్టార్ట్ చేయడానికి ముందు లొకేషన్ అంతా శానిటైజ్ చేస్తున్నారు. అలాగే, యూనిట్ మెంబెర్స్ టెంపరేచర్ చెక్ చేసి, లొకేషన్ లోకి పంపిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఎక్కువ టెంపరేచర్ వస్తే వెనక్కి పంపిస్తున్నారట. హీరో ఆది అయితే ఫ్యామిలీతో కాకుండా సపరేట్‌గా వేరే గదిలో నిద్రపోతున్నానని చెప్పాడు. షూటింగ్ కారణంగా ఇతరులను కలుస్తున్నానని, ఒకవేళ తనకు వస్తే... తనవల్ల ఫ్యామిలీకి కరోనా సోకకూడదని ముందుజాగ్రత్త పడుతున్నానని తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
