బన్నీ సినిమాకి హీరోయిన్ పేరు?
on Apr 7, 2020
ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ కానుకగా ఇవ్వనుంది. 'ఏమబ్బా... అందరూ బాగుండారా? మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే... #AA20 అప్డేట్ ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది. రెడీ కండబ్బా" అని మైత్రీ యూనిట్ ముందుగా చెప్పింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... బుధవారం టైటిల్‌తో అనౌన్స్ చేయనున్నారు. అలాగే, బన్నీ స్పెషల్ స్టిల్ కూడా. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే... శేషాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాస మాట్లాడుతూ కనిపిస్తారు. అప్డేట్ అని రిలీజ్ చేసిన పోస్టర్లో డైలాగులను కూడా చిత్తూరు యాసలో డిజైన్ చేశారు. ఇక, టైటిల్ విషయానికి వస్తే... మొదట్నుంచీ 'శేషాచలం' పేరు బాగా వినిపించింది. ఇప్పుడు కొత్తగా 'పుష్ప' సీన్లోకి వచ్చింది. అది సినిమాలో హీరోయిన్ పేరు. ఆ పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారని టాక్. కథలో హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఈ విధంగా చెబుతున్నారన్నమాట.