English | Telugu

నానిలో ఫోర్ షేడ్స్ ఉన్నాయ‌ట‌!!

on Feb 2, 2019

నాచుర‌ల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు కూడా చేరువైన హీరో.  గ‌త కొంత కాలంగా ట్రాక్ మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. లాస్ట్ ఇయ‌ర్ విడుద‌లైన `కృష్ణార్జున యుద్ధం` లో రాక్ స్టార్ గా మాస్ క్యార‌క్ట‌ర్ లో న‌టించాడు. అలాగే దేవ‌దాస్ చిత్రంలో డాక్ట‌ర్ గా న‌టించి మెప్పించాడు. అయితే తాజాగా నాని నాలుగు పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నాడ‌న్న స‌మాచారం అందుతోంది. ఒక‌సారి  ఆ వివారాల్లోకి వెళితే...`మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ డైర‌క్ష‌న్ లో ఒక సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.అయితే ఈ సినిమాలో నాని నాలుగు డిఫ‌రెంట్ ఏజ్ లుక్స్ లో క‌నిపించ‌డ‌నున్నాడ‌ట‌. 19 ఏళ్ల టీనేజ‌ర్‌గానూ, పాతికేళ్ల కుర్రాడిగానూ, 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కుడిగానూ, 50 ఏళ్ల వ్య‌క్తిగా ఇలా నాలుగు విభిన్న ఛాయ‌ల‌తో నాని పాత్ర ఉంటుంద‌ని వినికిడి.  ఈ ఫోర్ డిఫ‌రెంట్ లుక్స్ లో నాని మేక‌ప్ మాత్ర‌మే కాదు బాడీ లాంగ్వేజ్‌, మేకోవ‌ర్ కూడా డిఫ‌రెంట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. `ద క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజిమిన్ బ‌ట‌న్‌` ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంద‌ని టాక్ వినిపిస్తోంది. నాని కి జంట‌గా కీర్తి సురేష్ , ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ , మేఘా ఆకాష్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించే అవ‌కాశాలున్నాయి. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ ఇయ‌ర్ ఎండింగ్ లోనే సినిమాను తెర మీద‌కు తీసుక‌రానున్నార‌ట‌.  ప్ర‌స్తుతం నాని `జెర్సి` చిత్రంలో న‌టిస్తున్నాడు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here