English | Telugu

సూపర్‌స్టార్ సెట్‌లో లేడీ సూపర్‌స్టార్

on Aug 13, 2019

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు ` ప్రెసెంట్  షూటింగ్ యమా ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వాత విజయశాంతి ఒక కీలక పాత్రతో   రీ-ఎంట్రీ  ఇస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ రోజు తిరిగి మేకప్ వేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియపరిచారు.  ``ఇంత గ్యాప్ వచ్చిన కానీ విజయశాంతి గారిలో అదే డిసిప్లైన్, అదే  ప్రవర్తన , అదే డైనమిజం ఏమాత్రం తేడా లేదంటూ ట్వీట్ చేసారు``అనిల్ .  ఇందులో విజయశాంతి క్యారక్టర్ సినిమాకు చాలా కీలకం గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మహేష్ అజయ్ కృష్ణ అనే మేజర్ గా నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.  ఇప్పటికే రష్మిక, మహేష్ ల పై చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగొచ్చినట్లు తెలుస్తోంది.


Cinema Galleries



Latest News


Video-Gossips