పొలిటికల్ థ్రిల్లర్ గా `విజయ్ 65`?
on Mar 3, 2021
సంక్రాంతికి రిలీజైన `మాస్టర్`తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్. ఈ నేపథ్యంలో.. రెట్టించిన ఉత్సాహంతో తన నెక్స్ట్ వెంచర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. `కొలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే.. `విజయ్ 65`గా తెరకెక్కనున్న ఈ సినిమా.. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందనుందట. పొలిటికల్ లీడర్ అయిన విలన్ తో హీరో చేసే పోరాటమే ఈ చిత్రమని కోలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ మూవీలో విజయ్ బాడీ లాంగ్వేజ్ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఆయన దర్శనమిస్తాడని కథనాలు వస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రాల్లో విజయ్ నటించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల వచ్చిన `సర్కార్` కూడా పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే. మరి.. `సర్కార్`లాగే `విజయ్ 65` కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుందేమో చూడాలి.
కాగా, ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న నాయికగా నటించే అవకాశముందని బజ్.
Also Read