English | Telugu

క్రేజీ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయ్యింది

on Aug 13, 2019


           

 `ఇస్మార్ట్ శంకర్` సినిమా గ్రాండ్ సక్సెస్ తో మాంచి ఊపు లో ఉన్న పూరి తన తదుపరి సినిమాను ప్రకటించేశాడు. గత కొన్నిరోజులు గా వస్తోన్న న్యూస్ ని కంఫర్మ్ చేస్తూ ఈ రోజు పూరి తన నెక్స్ట్ సినిమా క్రేజీ స్టార్ తో అంటూ అధికారికం గా  ప్రకటన రిలీజ్ చేసాడు.  `ఇస్మార్ట్ శంకర్`  చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.   విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, సమర్పణ: లావణ్య, నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్, బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here