English | Telugu

ప్లే బాయ్ పాత్ర‌లో అర్జున్ రెడ్డి??

on Jan 16, 2019

ప్ర‌జంట్ ప్లే బాయ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం `ప్రేమ‌తో రా` అంటూ వెంక‌టేష్ న‌టించిన సినిమా ప్లేబాయ్ గా అల‌రించాడు. ఆ సినిమా అప్ప‌ట్లో పెద్ద‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత 8 ఏళ్ల క్రితం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `ఆరెంజ్‌` తో షార్ట్ ట‌ర్మ్ ల‌వ్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. మ్యూజిక‌ల్ గా ఆ రెండు సినిమాలు మెప్పించాయి.  కానీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక ప్ర‌స్తుతం అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ఓ షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్ క‌థే అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ హీరోల బాట‌లోనే యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌రకొండ కూడా వెళ్ల‌నున్నాడ‌ని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది.  `మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ కి జోడిగా రాశీఖ‌న్నా , కేథ‌రిన్ త్రెసా, ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తున్నారు. కాగా ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ లో విజ‌య్ ప్లే బాయ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌రి...ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తోంది. కె.య‌స్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here