క్రేజీ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఖరారైనట్టే!!
on Apr 3, 2019
ప్రజంట్ విజయ్ దేవరకొండ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అక్కడ హీరోయిన్లే కాదు హీరోలు సైతం విజయ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్, కైరా అద్వానీ లాంటి హీరోయిన్లు కాకుండా అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి హీరోలు కూడా విజయ్ దేవరకొండ నటనకు ఫ్యాన్ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఈయన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బాలీవుడ్. ఇప్పటికే ఈయన నటించిన `పెళ్లి చూపులు` సినిమాను రీమేక్ చేసారు. అర్జున్ రెడ్డి సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా ఈ చిత్రాన్ని అక్కడ రూపొందిస్తున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అలాగే `గీత గోవిందం` చిత్రం కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఇలా విజయ్ దేవరకొండ సినిమాలను బాలీవుడ్ లో వరుసగా రీమేక్ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే స్ట్రెయిట్ సినిమా విజయ్ దేవరకొండతో చేయాలని భావిస్తున్నారు అక్కడి దర్శక నిర్మాతలు. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ పై మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ అన్నీ కుదిరితే 2020 లో హిందీ సినిమా ఉంటుందంటూ సమాధానమిచ్చాడు. ఇక మన అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో లేదో చూడాలి.