English | Telugu

`గ‌ల్లీబాయ్` గా రౌడీ బాయ్!!

on Apr 16, 2019

 

ఇటీవ‌ల కాలంలో ఏ భాష‌లోనైనా సినిమా హిట్ట‌యిందంటే చాలు ...ఆ సినిమాను ఇత‌ర బాష‌ల వారు రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి  చూపిస్తున్నారు.  లేటెస్ట్ గా బాలీవుడ్ లో ప్రేమికుల దినోత్స‌వం కానుకగా విడుద‌లైన `గ‌ల్లీబాయ్` సినిమా సూప‌ర్ హిట్టైన సంగ‌తి తెలిసిందే. న‌ల‌భై కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 250 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ర‌ణ్ వీర్ సింగ్ , ఆలియాభ‌ట్ న‌టించిన ఈ సినిమాను జోయా అక్త‌ర్ డైర‌క్ట్ చేసింది. బాలీవుడ్ లో ఘన విజ‌యం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ముందుగా `గ‌ల్లీబాయ్` రీమేక్ ను సాయి ధ‌ర‌మ్ తేజ్ తో రీమేక్ చేయాల‌నుకున్న ఫైన‌ల్ గా ఈ ప్రాజెక్ట్ విజ‌య్ దేవ‌ర కొండ ద‌గ్గ‌రకు వ‌చ్చి ఆగిన‌ట్లు తెలుస్తోంది.  విజ‌య్ దేవ‌ర కొండ కూడా ఈ రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది.  ప్ర‌జంట్ `డియ‌ర్ కామ్రేడ్` తో పాటు క్రాంతి మాధవ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ  మ‌జిలీ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమాకు గ్రీన సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది. మ‌రి గ‌ల్లీ బాయ్ రీమేక్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఈ ప్రాజెక్ట్ విష‌యంలో నిజ‌నిజాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here