అమ్మ జయలలిత పాత్రలో విద్యాబాలన్
on Jun 12, 2018
సినిమాల్లో బయోపిక్ ల జోరు పెరిగింది.. మొన్నటి వరకు బయోపిక్ అంటే ఎప్పటికో ఒకటి వచ్చేది.. కానిప్పుడు బయోపిక్ లు క్యూ కడుతున్నాయి.. తెలుగులో వచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి' ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంది.. అలానే త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ కూడా రాబోతుంది.. తమిళ్ లో కూడా బయోపిక్ లు వస్తున్నాయి.. అమ్మ జయలలిత బయోపిక్ రాబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలొస్తున్నాయి.. ప్రస్తుతం జయలలిత బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.. అలానే ఈ సినిమాలో జయలలిత పాత్రని బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుందట.. అంతకముందు 'డర్టీ పిక్చర్' సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకున్న విద్యాబాలన్ జయలలిత బయోపిక్ తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి...