బన్నీకి తల్లిగా చిరంజీవి హీరోయిన్!!
on Feb 18, 2019
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో `జులాయి` ,`సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాలు వచ్చి సక్సెస్ సాధించాయి. ప్రజంట్ వీరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తొకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన `ఘరానా మొగుడు` ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నగ్మ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించనుంది. అవును బన్ని కి మదర్ గా నటించనుందట నగ్మ. త్వరలో దీనికి పై చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్ని సరసన హీరోయిన్ గా పూజా హెగ్డేని ఓకే చేసినట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే బన్నీకి తండ్రిగా బాలీవుడ్ నటుడు బొమన్ ఇరాని నటిస్తున్నాడు.