వెన్నెల కిశోర్ కి సూపర్ స్టార్ షాక్!
on Feb 3, 2018
అమితాబ్... ఈ పేరు వింటే అభిమానుల్లో బ్లడ్ సర్క్యులేషన్ స్పీడందుకుంటుంది. బాలీవుడ్ లో ‘మాస్’ అనే పదానికి పర్యాయపదంగా నిలిచిన సూపర్ స్టార్ బిగ్ బీ. వయసు ఏడు పదులు దాటినా... నేటికీ అభిమాన గణం తగ్గలేదంటే అమితాబ్ స్టార్ డమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... భారతదేశంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ట్విటర్ ఎకౌంట్ బిగ్ బీదే. మూడు కోట్లకు పైగా ఫాలోవర్స్ బిగ్ బీకి ఉన్నారు. వారిలో మన టాలీవుడ్ హాస్య నటుడు వెన్నెల కిశోర్ ఒకడు. అబితాబ్ కి మూడుకోట్ల పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నా... వారందరినీ అమితాబ్ ఫాలో అవ్వరు కదా. అయితే... రీసెంట్ గా వెన్నెల కిశోర్ కి ట్విట్టర్ కి ఓ మెసేజ్ వచ్చింది.
బిగ్ బీ తనను ఫాలో అవుతున్నట్టు ఆ మెసేజ్ ఆంతర్యం. దాంతో... వెన్నెల కిశోర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిన్నప్పట్నుంచీ వెన్నెల కిశోర్... బిగ్ బీ అభిమాని. ఆయనంటే పిచ్చి. ఆ అభిమానంతోనే బిగ్ బీ ట్విటర్ ని ఫాలో అవుతుంటాడు కిశోర్. ఇప్పుడు వెన్నెల కిశోర్ ని బిగ్ బీ ఫాలోవుతున్న విషయం తెలిసేసరికి ఈ కామెడీకింగ్ కి ఆనందం ఆగడంలేదు. ఇదిలావుంటే... రీసెంట్ గా తాను ట్విట్టర్ నుంచి తప్పకుంటున్నానని అమితాబ్ ప్రకటించారు. దాంతో... ‘బిగ్ బీ’ తనను ట్విట్టర్ లో ‘ఓకే’ చేసి... ఇంతలోనే ట్విటర్ నుంచి తప్పుకోవడం బాధగా ఉందని వెన్నెల కిశోర్ వాపోతున్నాడు. ఏది ఏమైనా... బిగ్ బీనే ఫాలోవర్ గా చేసుకున్న వెన్నెల కిశోర్ ని అభినందించకుండా ఉండలేం. ఏమంటారు?
Also Read