English | Telugu

వెంకీ మామా షూటింగ్ డేట్ ఫిక్స్

on Dec 1, 2018

విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ చైత‌న్యల మ‌ల్టీస్టార‌ర్ `వెంకీ మామ‌` రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ 12నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. `జై ల‌వ‌కుశ‌` ఫేమ్ బాబీ డైర‌క్ష‌న్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న హ్యుమీ ఖురేషి అలాగే చైతుకి జోడీగా ర‌కుల్ ప్రీతిసింగ్ న‌టించ‌నున్నారు. వెంకీ స్టైల్ లో ఉండే  ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా  తెర‌కెక్కుతోంది. స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని తీసుక‌రావాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్ష‌న్స్ , కోన ఫిలిం కార్పోరేష‌న్ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు సంయుక్తం నిర్మిస్తున్నాయి. ఇక వెంకటేష్ ప్ర‌స్తుతం ఎఫ్ -2 చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఫైన‌ల్ ద‌శ‌లో ఉంది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే నాగ చైత‌న్య నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `మ‌జిలీ` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఇటీవ‌లే రెండ‌వ షెడ్యూల్ పూర్తి చేసుకుంటోంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here