English | Telugu

హిట్ పెయిర్ మళ్ళీ రిపీట్ అవనుందా ?

on Jun 11, 2019


ఈ ఏడాది బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన మూవీ దేదే ప్యార్ దే. అజయ్ దేవగన్ హీరోగా టబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మే నెలలో రిలీజ్ అయినా ఈ సినిమా దాదాపు నెల కావస్తున్నా కొన్ని చోట్ల ఆడుతుందంటే సినిమా ఏమేర హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు, అయితే బాలీవుడ్ లో అంతటి సూపర్ హిట్ అయినా ఆ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే రామానాయుడు జయంతి సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో ఈ విషయాన్నీ ప్రస్తుత టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ప్రకటించారు. తన సోదరుడు వెంకటేష్ హీరోగా ఆ సినిమా రీమేక్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా మరో ప్రచారం మొదలయ్యింది. అదేంటంటే హిందీలో టబు పోషించిన పాత్రను, తెలుగులో కూడా పోషించనుందని అంటున్నారు. నిజానికి వీరిద్దరూ కలిసి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేసిన కూలీ నెంబర్ వన్ పెద్ద హిట్ అప్పట్లో ఈ నేపథ్యంలో ఈ జంట మళ్ళీ అలరించనుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇప్పటికే టబు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాలో తల్లి పాత్ర పోషించనుందనే విషయం తెలిసిందే. ఆమె ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండగా రీ ఎంట్రీ తర్వాత రెండో సినిమా వెంకీతో చేయనుందన్నమాట.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here