English | Telugu

బాలయ్య, వినాయక్ ల 'ఏ కె 47'

on Jun 13, 2018

 

బాలయ్య మొదటి నుండి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలతో, ఫ్యాక్షన్ సినిమాలు చేస్తే బాలయ్యే చేయాలి అనే స్థాయిలో ఆకట్టుకున్నాడు.. దర్శకుడు వి.వి.వినాయక్ కూడా అంతే.. మొదటి సినిమా ఆదితోనే తానేంటో నిరూపించుకున్నాడు.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ 'చెన్నకేశవ రెడ్డి'తో చూసాం.. అయితే బాక్స్ ఆఫీస్ దాహం తీరని వీరిద్దరూ మరోసారి బాక్స్ ఆఫీస్ పై యుద్దానికి సిద్ధమవుతున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్లో నటిస్తున్న బాలయ్య, త్వరలో వినాయక్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి 'ఏ కె 47' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.. అసలే మాస్ హీరో, మాస్ డైరెక్టర్.. వీళ్ళ కాంబినేషన్లో 'ఏ కె 47' అనే టైటిల్ తో ఫ్యాక్షన్ సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుందేమో.

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here