English | Telugu

యూ ట‌ర్న్ మూవీ రివ్యూ

on Sep 13, 2018

న‌టీన‌టులుః  స‌మంత‌, భూమిక‌, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్ర‌న్‌
క‌థ‌, ద‌ర్శ‌కుడు: ప‌వ‌న్ కుమార్
నిర్మాత‌లు: శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు
బ్యాన‌ర్స్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్
సంగీతం: పూర్ణచంద్ర తేజ‌స్వి
సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్
ఎడిటర్: సురేష్ ఆర్ముగం
విడుదలైన తేది : 13/09/2018
   
  మ‌న ప‌ని అయితే చాలు...మిగ‌తా వాళ్లు ఏమైతేనేం...అంటూ మ‌నం చాలా సార్లు మిస్టేక్స్ చేస్తుంటాం...కానీ వాటి వ‌ల్ల మ‌న‌వాళ్లకు  కూడా హానీ జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని తెలియ‌జెప్పే చిత్ర‌మే `యూట‌ర్న్ `. మిస్ట‌రీతో పాటు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సాగే ఈ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లైంది.   అక్కినేని  స‌మంత ఫ‌స్ట్ టైమ్ న‌టించిన లేడీ  ఓరియెంటెడ్  చిత్రమిది.  ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రం ట్రైల‌ర్ తో ఇంట్ర‌స్టింగ్ క్రియేట్ చేసింది. మ‌రి ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకునేలా ఉందా లేదా అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం...

 స్టోరిః

 ర‌చ‌న (స‌మంత‌) టైమ్స్ ఆఫ్ ఇండియాలో జ‌ర్న‌లిస్ట్ గా ప‌ని చేస్తుంది. రామ‌కృష్ణా పురం ఫ్లై ఓవ‌ర్ మీద జ‌రిగే యాక్సిడెంట్స్ కు సంబంధించి ఒక ఆర్టిక‌ల్ రెడీ చేయ‌డానికి ఆ ఫ్లై ఓవ‌ర్ పై ఎవ‌రు యూ ట‌ర్న్ తీసుకుంటున్నారో తెలుసుకుని , వారు ఎందుకు? అలా చేస్తున్నారో ఇంట‌ర్య్వూ చేయడానికి  ఒక వ్య‌క్తి ద్వారా వెహిక‌ల్ నెబంర్స్ క‌లెక్ట్ చేస్తుంది.  అలా వారి అడ్ర‌స్ సేక‌రించి ఇంట‌ర్వ్యూ చేయాల‌నుకుని సుంద‌ర్ అనే ప‌ర్స‌న్ ద‌గ్గ‌ర‌కు మొద‌ట‌గా వెళ్తుంది. కానీ ఆ సుంద‌రం చ‌నిపోయి ఉంటాడు. దీంతో సుంద‌రం ను మ‌ర్డ‌ర్ చేసింద‌ని పోలీసులు ఆమెను ర‌చ‌న‌ను అనుమానిస్తుంటారు.  ఈ ప్రాసెస్ లో ఎస్ ఐ నాయ‌క్ ( ఆది) ర‌చ‌న ఈ మ‌ర్డ‌ర్ చేయ‌లేద‌ని తెలుసుకుంటాడు.  ఇలాంటి స‌మ‌యంలో ఆ ఫ్లై ఓవ‌ర్ పై టర్న్ తీసుకున్న ప్ర‌తి ఒక్క‌రూ చ‌నిపోతుంటారు. వారిని ఎవ‌రు చంపుతుంటారు. ర‌చ‌న ను ప్రేమించే రాహుల్ ర‌వీంద్ర‌న్ కి ఈ మ‌ర్డ‌ర్స్ కి లింకేంటి? ఎస్ ఐ ఆది ర‌చ‌న‌కు ఎలా హెల్ప్ చేసాడు? ఆ ఫ్లై ఓవ‌ర్ పై ఏం జ‌రిగింది అన్న‌ది మిగ‌తా స్టోరి.

న‌టీ న‌టుల ప‌నితీరుః
 
 మ‌హాన‌టిలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన స‌మంత ఈ చిత్రంలో మ‌రోసారి ఆ పాత్ర‌లో ఒదిగిపోయింది.  ర‌చ‌న పాత్ర‌లో త‌ను జీవించింది.  ఒక వైపు బాధ్య‌త గ‌ల రిపోర్ట‌ర్ గా,  మ‌రో వైపు ఆ బ్రిడ్జ్ పై అస‌లు ఏం జ‌రుగుతుంది? ఏంటి అన్న తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితుల‌కు  అద్దం ప‌ట్టేలా ప్రేక్షకుల‌కు మ‌రింత క్యూరియాసిటీ పెంచేలా స‌మంత అద్భుత‌మైన న‌ట‌న  క‌న‌బ‌రుస్తూ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లింది స‌మంత‌.  ఎస్ ఐ గా ఆది పినిశెట్టి త‌న నేచ‌ర‌ల్ ప‌ర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు.  క్రైమ్ రిపోర్ట‌ర్ గా రాహుల్ రవీంద్ర‌న్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేక‌పోయినా క్లైమాక్స్ లో త‌న పాత్ర ద్వారా మంచి ట్విస్ట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.  భూమిక పాత్ర సినిమా కే ఎంతో ప్ర‌ధానమైన‌ది.  మిగ‌తా వారంద‌రూ కూడా వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః

 డైర‌క్ట‌ర్ తీసుకున్న కాన్సెప్ట్ అందులో ఉన్న మెసేజ్ బాగుంది.  ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే ఉంటే ఉత్కంఠ‌ పెరిగేది.  పూర్ణ చంద్ర నేప‌థ్య సంగీతం సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంటూ  సినిమా మూడ్ లో కి తీసుకెళ్తుంది. విజువ‌ల్స్ ,ఎడిటింగ్ బాగుంది.   సాంకేతికంగా  ఎక్క‌డా లోపాలు క‌నిపించ‌వు. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

విశ్లేష‌ణః

 ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్ కి స‌రైన ట్రీట్ మెంట్ రాసుంటే రాయ‌డానికి ఇంకా చాలా ఉండేది. ఫ‌స్టాఫ్ అంతా యూట‌ర్న్ కి సంబంధించిన ఇన్విస్టిగేష‌న్  ఇంట్ర‌స్టింగ్ గా తీసుకెళ్తూ స‌స్సెన్స్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు సెకండాప్ కి వ‌చ్చే స‌రికి కొంచెం సాగ‌దీసినట్టుగా అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ ప్రిడ‌క్ట్ బుల్ గా ఉంటూ త‌ర‌వాత ఏంటో అనేది ఊహించేస్తుంటాం.  ముఖ్యంగా భూమిక చావ్లా  చనిపోయి ఆత్మ‌లుగా మారి రివేంజ్ తీసుకోవ‌డం కొంత రియాలిటీకి దూరంగా కనిపిస్తాయి.  సినిమాలో ఫ‌న్ ఏమీ లేక‌పోవ‌డం..క‌మిర్షియ‌ల్ అంశాల‌కు తావు లేక‌పోవ‌డం కొంత డ్రా బ్యాక్ గా చెప్ప‌వ‌చ్చు.   స‌మంత అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ తో పాటు మిస్ట‌రీ , సస్పెన్స్ థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు ఈ చిత్రం  న‌చ్చే అవ‌కాశ‌లుంటాయి.  

సూటిగా చెప్పాలంటేః  ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌
 

రేటింగ్ 3/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here