ఎన్టీఆర్ టెక్నిక్ తెలిసింది!
on Oct 10, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఏ దర్శకుడు వర్క్ చేసినా చెప్పే మాట ఒకటుంటుంది! అదేంటంటే... 'ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్' అని! ఏ సన్నివేశాన్నైనా ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో ఎలా పూర్తి చేయగలడు? అనే ప్రశ్నకు సమాధానం తెలిసిందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ టెక్నీక్ తనకు తెలిసిందని ఆయన వివరించారు. "ఎన్టీఆర్ వీలైనన్ని ఎక్కువసార్లు కథను వింటారు. ప్రతి సన్నివేశాన్ని మైండ్లోకి ఎక్కించుకుంటారు. ప్రతిదీ ఆయనకు గుర్తుంటుంది. సెట్‌కి వెళ్ళిన తరవాత ఆయనకు మనం సన్నివేశం వివరిస్తుంటే... అదే కదా అంటూ గుర్తు చేస్తారు. రివర్స్‌లో దర్శకుడికి కంప్లీట్ సీన్ వివరిస్తారు. డైలాగులు కూడా ఆయనకు గుర్తుంటాయి. ఒకవేళ డైలాగులు రెండు మూడు మార్చినా ఇబ్బంది పడరు. డిస్కషన్ టైమ్‌లో చెప్పిన డైలాగుల కంటే పెద్దగా ఏం మార్చడం వంటివి వుండవు. రెండు మూడు యాడ్ చేస్తా. వాటినీ అవలీలగా చెప్పేస్తారు" అని చెప్పారు. హరికృష్ణ మరణం తరవాత ఆ విషాదం ఎన్టీఆర్ నుంచి త్వరగా కోలుకున్నారని, ఆ విషాదాన్ని అందరికీ పంచిపెట్టలేదని త్రివిక్రమ్ తెలిపారు. ఎన్టీఆర్‌కి తాము ధైర్యం ఇవ్వలేదని, ఎన్టీఆరే తమకు ధైర్యాన్ని ఇచ్చాడని ఆయన అన్నారు.