గరుడవేగంగా రాజమౌళీ ట్వీటాడు
on Nov 4, 2017
మంచి సిినిమాలను ప్రోత్సహించడంలో.. దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడూ ముందే ఉంటారు. సాధారణంగా మంచి టాక్ వచ్చిన సినిమాను తన ట్వీట్ల ద్వారా బంపర్ హిట్ స్థాయిలో నిలబెడతాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళీ ట్వీట్ చేస్తే.. యావరేజ్ సినిమా హిట్ అవుతుంది. హిట్ సినిమా సూపర్ హిట్ అవుతుంది.సూపర్ హిట్ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ దర్శకధీరుడు ట్వీట్ కి ఉన్న కెపాసిటీ అలాంటిది. ఒక్క ట్వీట్ తో సంపూర్ణేష్ బాబుని స్టార్ ని చేసేసిన ఘనుడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి.. రాజశేఖర్ ‘గరుడు వేగ’ చిత్రంపై ట్వీట్ చేశాడు. ‘సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నాను. ఆదివారం టికెట్లు కూడా బుక్ చేసేశా’ అని ట్వీట్ చేశాడు. ఇంకేముందు.. రాజమౌళీ ట్వీట్ తో ఈ సినిమా సక్సెస్ రేట్ అమాంతం పెరిగిపోవడం ఖాయమైపోయింది. రాజశేఖర్ కూడా వెంటనే స్పందించాడు.. ‘సార్.. మీ అభినందన మాకు కొండంత బలాన్నిచ్చింది. ధన్యవాదాలు సార్. ’అని రాజశేఖర్ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా.. చాలా విరామం తర్వాత రాజశేఖర్ కి మంచి విజయం రావడం నిజంగా అనందించాల్సిన విషయమే.