తొలిప్రేమ విజయానికి కారణం ఆ వ్యక్తి..?
on Feb 10, 2018
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిదా తర్వాత వరుణ్ నటించిన సినిమా కావడం.. బాబాయ్ పవన్ కళ్యాణ్ టైటిల్‌ని పెట్టడంతో తొలిప్రేమపై మంచి బజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలిప్రేమపై మూవీ లవర్స్ చూపు పడింది. ఈ సంగతి పక్కనబెడితే.. పవన్‌కళ్యాణ్‌కు యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ రావడానికి కారణం తొలిప్రేమ సినిమా. ఈ మూవీలో పవన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తమని తాము హీరోగా ఊహించుకున్నారు. వెంకీ అట్లూరి కథ చెప్పిన తర్వాత.. షూటింగ్ టైంలోనూ ఈ మూవీకి ఏం టైటిల్ పెట్టాలా అని చిత్రయూనిట్ జుట్టు పీక్కుంది. ఈ సమయంలో తొలిప్రేమ టైటిల్ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందట.. అయితే ఈ టైటిల్ దొరకడం అంత ఈజీ కాదు. సినిమాకి సంబంధించిన రైట్స్ ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన.. ఉషాకిరణ్ మూవీస్ ఆధీనంలో ఉన్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. మీడియా మొఘల్ దృష్టికి తీసుకెళ్లగా.. రామోజీ రావు టైటిల్ ఇవ్వడానికి వెంటనే అంగీకరించారట. ఇంత కథ నడిస్తే కానీ తొలిప్రేమ టైటిల్ వరుణ్‌తేజ్‌కు దక్కలేదు.