విజయ్, పూజ.. పొంగల్ స్పెషల్
on Apr 9, 2021
కోలీవుడ్ స్టార్ విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ఓ తమిళ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. `కొలమావు కోకిల` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. `విజయ్ 65`గా తెరకెక్కనున్న ఈ సినిమాని 2022 పొంగల్ స్పెషల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగానే సినిమాని చకచకా పూర్తిచేసేందుకు యూనిట్ స్కెచ్ వేసిందట. త్వరలోనే `విజయ్ 65` రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.
కాగా, పొంగల్ సీజన్ లో విజయ్ నటించిన పలు చిత్రాలు తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా రిలీజైన `మాస్టర్` కూడా సంక్రాంతి సినిమానే. ఇక పూజ విషయానికొస్తే.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన `అల వైకుంఠపురములో` సంక్రాంతి సీజన్ లోనే విడుదలైంది. మరి.. విజయ్, పూజకి మరోసారి పొంగల్ అచ్చొస్తుందేమో చూడాలి.
`విజయ్ 65`కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు.
Also Read