ముస్లిం అమ్మాయితో పాటల రచయిత లవ్ మ్యారేజ్
on Nov 23, 2020
ప్రేమకు, పెళ్లికి కులం, మతం, భాష అడ్డుకాదని చెప్పడానికి పాటల రచయిత శ్రీమణి వివాహం మరో ఉదాహరణ అని చెప్పవచ్చు. ఆదివారం ఆయన పెళ్లి చేసుకున్నారు. శ్రీమణి సతీమణి పేరు ఫరా. ఆమె ముస్లిం అమ్మాయి. శ్రీమణి హిందువు. విశేషం ఏమిటంటే... పదేళ్ల నుండి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారట. ఈ సంగతి శ్రీమణి చెప్పారు.
"నా జీవితంలోని నా స్వీట్ లిటిల్ ఏంజిల్ (ఫరా)కి స్వాగతం. పదేళ్ల నుండి మేం ఈ మూమెంట్ (పెళ్లి) కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ... మా కల నిజమైంది. మా మనసులు అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లితండ్రులకు థాంక్స్" అని పెళ్లి ఫోటోలను శ్రీమణి ట్వీట్ చేశారు.
తెలుగులో చక్కటి సాహిత్యం అందించే గేయ రచయితల్లో శ్రీమణి ఒకరు. 'అత్తారింటికి దారేది'లో 'వీడు ఆరడుగుల బుల్లెట్టు', 'మహర్షి'లో 'పదరా పదరా పదరా' వంటి హిట్ పాటలు ఆయన రాసినవే. '100% లవ్', 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'గీత గోవిందం', 'ఎఫ్ 2', 'సరిలేరు నీకెవ్వరు' తదితర సినిమాల్లో పాటలను శ్రీమణి రాశారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
