'ఖైదీ'ని మెచ్చిన సూపర్ స్టార్!
on Nov 3, 2019
కార్తీ టైటిల్ రోల్ చేసిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ' దీపావళి బ్లాక్‌బస్టర్‌గా సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ 'ఖైదీ'ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. "న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్‌తో 'ఖైదీ' చాలా బాగుంది. ఆకట్టుకునే స్క్రిప్ట్, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్‌తో పాటు నటులు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇటువంటి సబ్జెక్టులో పాటలు లేకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. యూనిట్‌కు నా అభినందనలు" అంటూ పోస్ట్ చేశారు మహేశ్. ఆయనకు హీరో కార్తీ, దర్శకుడు లోకేష్, నిర్మాతలు ఎస్.ఆర్. ప్రభు, కె.కె. రాధామోహన్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ "మా చిత్రాన్ని చూసి, ప్రశంచించిన మహేశ్ గారికి ధన్యవాదాలు. 'ఖైదీ' అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపారు.