నిజమే... మహేష్ బ్రేక్ తీసుకుంటున్నాడు
on Nov 2, 2019
పిల్లలు గౌతమ్, సితారకు సెలవులు వచ్చినప్పుడు మహేష్ బాబు, నమ్రత ఫ్యామిలీ విదేశాలకు వెళ్లడం కామన్. కానీ, పిల్లలతో మరింత టైమ్ స్పెండ్ చేయాలని ఈమధ్య కాలంలో షూటింగులకు మహేష్ సెలవులు పెట్టిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. 'మహర్షి' విడుదలైన వెంటనే 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ స్టార్ట్ చేశాడు. అందుకని, సంక్రాంతికి 'సరిలేరు...' విడుదలైన తర్వాత మూడు నెలలు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. సినిమాల నుండి అంటే షూటింగులకు మాత్రమే. కథలు వింటారట. సంక్రాంతి తర్వాత మహేష్ మూడు నెలలు బ్రేక్ తీసుకుంటున్న విషయం నిజమేనని నమ్రత కూడా ధృవీకరించారు. అదీ పిల్లలతో కాస్త ఎక్కువ సమయం గడపటానికి, తర్వాత సినిమా కోసం ప్రిపేర్ కావడానికి అని ఆమె అన్నారు. గతంలో తీసుకున్న బ్రేక్ తో కంపేర్ చేస్తే ఇదేమంతే పెద్ద బ్రేక్ కాదనేది నమ్రత అభిప్రాయం. 'అతిథి' తర్వాత మహేష్ బాబు మూడేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. 2007 నుండి 2010 వరకు... 'అతిథి', 'ఖలేజా' మధ్య మహేష్ మరో సినిమా చేయలేదు. ఇప్పుడు ఎటువంటి వర్క్ ప్రెజర్స్ లేకుండా మూడు నెలలు లాంగ్ హాలీడే తీసుకోవాలని మహేష్ అనుకుంటున్నాడట.