సరిలేరు... సెట్స్‌లోనే మహేష్ దీపావళి
on Oct 29, 2019
సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాంచి స్పీడు మీదున్నారు. దీపావళి పండక్కీ ఆయన సెలవులు పెట్టకుండా పని చేస్తున్నారు. సినిమా స్టార్స్ అందరూ సెలబ్రేషన్స్‌లో ఉంటే... సూపర్‌స్టార్ మాత్రం షూటింగ్ చేస్తున్నారు. ఓ పక్క ‘సరిలేరు నీకెవ్వరు’ స్టిల్స్ విడుదల చేయిస్తూనే, మరో పక్క షూటింగ్ చేస్తున్నారు. దాంతో పండక్కి మహేష్ వైఫ్ నమ్రత, డాటర్ సితార సెట్స్‌కి వెళ్లారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్లో షూటింగ్ జరుగుతోంది.
దాంతో దీపావళిని సెట్స్‌లోనే సెలబ్రేట్ చేసుకున్నారు సితార. తండ్రి ఒడిలో సితార కూర్చున్న ఫొటోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో ముగుస్తుంది. నవంబర్ 4 నుండి కేరళ, తమిళనాడులో షూటింగ్ చేయనున్నారు. నవంబర్ నెలాఖరు వరకూ జరిగే ఆ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపు పూర్తవుతుందట!