ప్రభాస్ గురించి చాలా తక్కువమందికి తెలిసిన నిజాలు..!
on Oct 23, 2019
లక్షలాది మంది ఫ్యాన్స్‌కు అక్టోబర్ 23 ఒక పండగ రోజు. ఎందుకు కాదు? అది 'బాహుబలి' ప్రభాస్ పుట్టినరోజు మరి! నేటితో 40 ఏళ్లు నిండుతున్న అతనికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ అనేకమంది బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్న 'హ్యాపీ బర్త్‌డే డార్లింగ్', 'హ్యాపీ బర్త్‌డే ప్రభాస్' అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో తమ ఫేవరేట్ స్టార్ బర్త్‌డేని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 'డార్లింగ్'గా అందరి చేతా ప్రశంసలు పొందుతున్న ప్రభాస్.. 'బాహుబలి', 'సాహో' సినిమాల్లో చేసిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల హృదయాల్ని గెలుచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రభాస్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతగా లైంలైట్లో ఉంటూ ఉందో, అతని పర్సనల్ లైఫ్ కూడా తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది.
చాలా కాలం నుంచే "మీ పెళ్లెప్పుడు?" అని ప్రశ్నను తరచూ ఎదుర్కొంటూ వస్తున్నాడు ప్రభాస్. సహనటి అనుష్కతో అతను ప్రేమాయణం నడుపుతున్నాడంటూ పదే పదే ప్రచారంలోకి వస్తుంటే, ఆ ఇద్దరూ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, తమ మధ్య అలాంటి అనుబంధం లేదని చెబుతూ వస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మూడేళ్ల నుంచీ.. ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చెప్పుకుంటూ వస్తున్నా, ఆ మాటలు ఇంతవరకూ వాస్తవ రూపం దాల్చలేదు. ఈ 40వ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ గురించి ఎక్కువమందికి తెలీని కొన్ని నిజాల్ని చెప్పుకుందాం. అవి చాలామందిని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. అవేమిటంటే...
ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.
ప్రభాస్ అభిమాన దర్శకుడు రాజమౌళి అనే విషయం మనకు తెలుసు. కానీ రాజమౌళి కంటే ప్రభాస్ అభిమానించే మరో డైరెక్టర్ ఉన్నాడు. ఆయన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ. హిరాణీ రూపొందించిన ఫేమస్ ఫిలింస్ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్' సినిమాల్ని ప్రభాస్ 20 కంటే ఎక్కువసార్లు చూశాడు.
బ్యాంకాక్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటుచేయబడిన తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్.
ప్రభాస్ అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడే తెలుగు సినిమా, అతని పెదనాన్న కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించగా 1976లో విడుదలైన 'భక్త కన్నప్ప'.
ప్రభాస్ అభిమాన హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో.
'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు రెండూ హిందీలో విడుదలయ్యాయి కానీ ఆ రెండూ డబ్బింగ్ వెర్షన్లే. ప్రభాస్ ఫస్ట్ హిందీ మూవీ 'సాహో' అని చాలామంది అనుకుంటారు. కానీ 2014లోనే అతను అజయ్ దేవగణ్ మూవీ 'యాక్షన్ జాక్సన్'లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు.
2017లో జీక్యూ మేగజైన్ కూర్చిన 'మోస్ట్ ఇంఫ్లూయెన్షియల్ యంగ్ ఇండియన్స్' జాబితాలో ప్రభాస్ ఆరో స్థానంలో నిలిచాడు.
యాక్టర్ కావాలని మొదట్లో ప్రభాస్ అనుకోలేదు. హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్లాలనేది అతని ఆలోచన. అతను బాగా ఇష్టపడే వంటకం చికెన్ బిర్యాని. అతని ఫేవరెట్ కలర్.. బ్లాక్.
'బాహుబలి' కేరెక్టర్ కోసం అతను అదివరకటి కంటే 30 కిలోల బరువు ఎక్కువగా పెరిగాడు. నాలుగేళ్ల పాటు ఆ బరువును మెయిన్టైన్ చెయ్యడానికి రోజూ ఆహారంలో చికెన్, గుడ్లు తీసుకుంటూ వచ్చాడు.
'బాహుబలి' పాత్రకు కావాల్సిన రూపాన్ని పొందడంలో భాగంగా వాలీబాల్ ఆడుతూ వచ్చాడు ప్రభాస్. తన ఇంట్లోనే వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసుకొని, ఎప్పుడు ఆడాలంటే అప్పుడు ఆడుతూ వచ్చాడు.
'బాహుబలి 2' మూవీ చేస్తున్న సమయంలో ఒక ఫిట్నెస్ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం వచ్చిన 5.5 కోట్ల రూపాయల ఆఫర్‌ను వదులుకున్నాడు ప్రభాస్.
ఇప్పటిదాకా అతనికి 6 వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి.
ప్రభాస్‌కు పక్షులంటే చాలా ఇష్టం. అతని ఇంట్లోని గార్డెన్లో ఎన్నో రకాల పూల చెట్లతో పాటు పక్షులూ ఉంటాయి.
Also Read