బాలకృష్ణ 105వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
on Oct 7, 2019
సంక్రాంతి 2020కి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల... వైకుంఠపురములో', నందమూరి కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' చిత్రాలు విడుదల కానున్నాయి. అంతకు మించి పెద్ద పోటీ ఏమీ లేదు. కానీ, సంక్రాంతికి ముందు వచ్చే పెద్ద పండుగ, ఏడాదిలో చివరి పండగ క్రిస్మస్ కి ఎక్కువ పోటీ నెలకొంది. హిట్ సినిమా 'జై సింహ' కాంబినేషన్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా, రవితేజ 'డిస్కో రాజా', నితిన్ 'భీష్మ' తదితర సినిమాలు ఉన్నాయి. అందరికంటే ముందుగా బాలకృష్ణ తన సినిమాను విడుదల చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. హీరోగా బాలకృష్ణకు 105వ సినిమా ఇది. ఆల్రెడీ 50% సినిమా షూటింగ్ పూర్తయింది. ఫస్టాఫ్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈనెల 14 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నార్త్ ఇండియాలో 40 రోజులపాటు నాన్ స్టాప్ గా జరిగే ఆ షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read