'సైరా'లో ఆ బుడ్డోడు ఎవరో తెలుసా?
on Oct 3, 2019
'సైరా నరసింహారెడ్డి' చిత్రం చాలామంది తల్లితండ్రులకు పుత్రోత్సాహాన్ని ఇచ్చింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది... చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి, సతీమణి సురేఖ గురించి. తొలి స్వాతంత్ర్య సమరశంఖం పూరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో తనయుణ్ణి చూసుకుని అంజనాదేవి సంతోషపడుతున్నారు. కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా సాధించిన విజయాన్ని, కాస్ట్యూమ్ డిజైనర్ గా కుమార్తె సుష్మిత ప్రతిభను చూసి సురేఖ గర్వపడుతున్నారు. వాళ్ళిద్దరికీ మాత్రమే కాదు, 'సైరా' దర్శకుడు సురేందర్ రెడ్డి సతీమణి దీపారెడ్డికీ ఈ సినిమా పుత్రోత్సాహాన్ని ఇచ్చింది. అదెలా అంటారా? సినిమాలో చిన్నప్పటి నరసింహారెడ్డి పాత్ర పోషించినది సురేందర్ రెడ్డి చిన్న కుమారుడు ఆయాన్ష్ రెడ్డి. కుమారుణ్ణి తెరపై చూసుకుని దీప సంబరపడుతున్నారు. అలాగే, ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కుమారుడు విన్ను కూడా ఈ సినిమాలో నటించాడు. తెల్ల దొరలూ పంటను తీసుకువెళ్తుంటే పిడికెడు వెనక్కి తీసుకుని, వాళ్ళ చేతిలో బలైన చిన్నారిగా, రోహిణి కుమారుడిగా నటించింది విన్ను. ఆ పిల్లాడి మరణంతో ఉయ్యాలవాడ ఉగ్రరూపం దాలుస్తాడు. ఇంకా చాలామంది తల్లితండ్రులకు ఈ సినిమా పుత్రోత్సాహాన్ని ఇచ్చింది.
Also Read