అనుష్క పెయింటింగులు... ఫైటింగులు!
on Sep 13, 2019
అనుష్క పెయింటింగ్ ఆర్టిస్ట్ అనేది 'నిశ్శబ్దం' ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. ఈ పెయింటర్ మాట్లాడలేదని ఫస్ట్ లుక్ తో పాటు ఫిల్మ్ యూనిట్ ఒక నోట్ రిలీజ్ చేసింది. సినిమాలో అనుష్క పేరు సాక్షి. ఆమె మాట్లాడలేదు. కానీ, ఆమె వేసే బొమ్మలు మాట్లాడతాయి. ఇదీ క్లుప్తంగా క్యారెక్టర్ గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్. ఈ సినిమా కోసం అనుష్క ఆరు నెలలు పెయింటింగ్, మూగ సైగలు నేర్చుకున్నారని దర్శకుడు హేమంత్ మధుకర్ తెలిపారు. ఆరు నెలల పాటు ప్రతి రోజూ ఒక పెయింటర్, మూగ సైగలు నేర్పించే టీచర్... అనుష్కకు ట్రయినింగ్ ఇచ్చారని, ఆమె రోజూ ఆ రెండూ ప్రాక్టీస్ చేసేవారని దర్శకుడు చెప్పారు. 'నిశ్శబ్దం'లో అనుష్క జస్ట్ పెయింటింగులు మాత్రమే వేయరు. కొన్ని సన్నివేశాల్లో ఫైటింగులు కూడా చేస్తారట. థ్రిల్లర్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాధవన్, అనుష్క జంటగా కనిపించనున్నారు. అనుష్క తొలి తమిళ సినిమా 'రెండు'లో మాధవన్ హీరో. మళ్లీ వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ఇదే. ఇందులో అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.