కొత్త గెటప్ లోకి బాలయ్య
on Sep 5, 2019
సింహా, పరమవీరచక్ర, లెజెండ్, లయన్, డిక్టేటర్, జై సింహ... మధ్యలో ఒకట్రెండు సినిమాలు పక్కన పెడితే ఈ మధ్య ప్రతి సినిమాలోనూ బాలకృష్ణ రెండు లేదా అంతకంటే ఎక్కువ గెటప్పుల్లో సందడి చేశారు. అంతకు ముందు కూడా డ్యూయల్ షేడ్ ఉన్న రోల్స్ బాలకృష్ణ ఎక్కువే చేశారు. 'జై సింహా' తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ బాలకృష్ణ రెండు గెటప్పుల్లో కనిపించనున్నారు. ఆల్రెడీ ఓ గెటప్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించారు. అందులో బాలయ్య చాలా స్టయిలిష్ గా ఉన్నాడు. మరో గెటప్ త్వరలో విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఆ గెటప్ లోకి బాలకృష్ణ మారుతున్నారు. రామోజీ ఫిలింసిటీలో మరో గెటప్ కి సంబంధించిన షూటింగ్ ఈ రోజు నుండి మొదలు పెడుతున్నారు. బాలకృష్ణ, భూమికపై కీలక సన్నివేశాలు తీయడానికి ప్లాన్ చేశారు. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాత సి. కల్యాణ్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం చకచకా పూర్తి చేస్తున్నారు.